Friday, November 22, 2024
HomeTrending Newsశాంతి చర్చలు అసంపూర్ణం

శాంతి చర్చలు అసంపూర్ణం

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం – తాలిబాన్ ల మధ్య జరుగుతున్న చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఖతార్ రాజధాని దోహలో రెండు వర్గాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజులుగా జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. చర్చలు వేగవంతం చేయాలని తీర్మానం చేసిన  ఇరు వర్గాలు కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకోలేదు. దేశాభ్యున్నతి కోసం కలిసి కృషి చేయాలని నేతలు పిలుపు ఇచ్చారు.

ప్రభుత్వ ఆస్తులు, ప్రజల జీవనానికి ఆటంకం కలిగే ఎలాంటి హింసకు తావు ఇవ్వరాదని ఉభయులు అంగీకారానికి వచ్చారు. శాంతి చర్చల్లో భాగంగా ప్రభుత్వం ఖైదు చేసిన తాలిబాన్ లను విడుదల చేస్తున్నారని మీడియా లో ప్రచారం జరగుతోంది. ఎంతవరకు వాస్తవం అనేది అధికారికంగా ఎవరు దృవీకరించలేదు. చర్చలు ఫలప్రదం అయ్యాయని రెండు వర్గాల ప్రతినిధులు వెల్లడించారు.

గత నెల రోజుల నుంచి దేశంలో హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాలిబాన్ ఉగ్రమూకలు ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే అనేక ప్రాంతాలపై పట్టు బిగిస్తున్నారు. తమ అధీనంలోని ప్రాంతాల్లో పూర్వపు చట్టాలను అమలు చేయటం ప్రారంభించారు. మగవాళ్ళు గడ్డాలు పెంచటం, మగవారి తోడు లేకుండా మహిళలు బహిరంగ ప్రదేశాలకు రావొద్దని ఇప్పటికే హుకుం జారీ చేశారు. చాలా చోట్ల విద్యాలయాలను కూల్చివేస్తున్నారు. తాలిబాన్ తో కలిసి కొన్నేళ్ళుగా పనిచేస్తున్న  యువకులకు పెళ్లి చేయాలని తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్ళికాని యువతులు, భర్త చనిపోయిన ఒంటరి మహిళల వివరాలు ఇవ్వాలని ముల్లాలు, ఇమాం లను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్