Friday, March 29, 2024
Homeసినిమావరుణ్ తేజ్ ‘గని’ లో తమన్నా రీల్ కి అనూహ్య‌ స్పంద‌న‌

వరుణ్ తేజ్ ‘గని’ లో తమన్నా రీల్ కి అనూహ్య‌ స్పంద‌న‌

Tamannah-Gani: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్ గా కిర‌ణ్‌ కొర్రపాటిని ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘గని’. ఈ చిత్రాన్ని అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు లెజెండ‌రి ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ అండ్ సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే.. రీసెంట్ గా విడుద‌లైన‌ స్టార్ హీరోయిన్ తమన్నా సాంగ్ కి సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ రావ‌టం విశేషం. ఈ పాట‌కి వ‌చ్చిన రెస్పాన్స్ కి హీరోయిన్ త‌మ‌న్నా కూడా మ‌రింత ఉత్సాహంతో ఈ సాంగ్ మీద రీల్స్ చేయ‌టం ఫ్యాన్స్ కి మరింత వూపిచ్చింది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్న ‘కొడితే’ సాంగ్ కి ఇప్పుడు స్పెష‌ల్ క్రేజ్ రావ‌టం అంద‌రూ ఈ సాంగ్ మీద రీల్స్ చేయ‌టం గ‌ని సినిమా క్రేజ్ ని మ‌రోక్క‌సారి ప్రూవ్ చేసింది.

ప్ర‌ముఖ ర‌చ‌యిత రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాసారు. హారిక నారాయణ్ ఈ పాట పాడారు. తమన్నా అందచందాలు పాటకు అదనపు ఆకర్షణ నిలిచాయి. అంతేకాదు సినిమాలో వ‌రుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ తో బాక్సింగ్ రింగ్ లో రియ‌లిస్టిక్ పెర్‌ఫార్మెన్స్ తో అల‌రించ‌నున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర, న‌దియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి అతిత్వ‌ర‌లో ఈ సినిమా డేట్ ని లాక్ చేసుకుంటున్నారు నిర్మాత‌లు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్