Saturday, January 18, 2025
Homeసినిమారామ్ కి విలన్ గా ఆర్య.?

రామ్ కి విలన్ గా ఆర్య.?

ఎనర్జిటిక్ హీరో రామ్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా ఓ భారీ చిత్రం రూపొందుతోంది. దీనికి తమిళ దర్శకుడు లింగుసామి దర్శకుడు. తెలుగు, తమిళ్ లో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్  ఈ నెల 12 నుంచి సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దీనికి ‘ఉస్తాద్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో రామ్, పోలీస్ ఆఫీసర్ గా, డాక్టర్ గా డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే.. డ్యూయల్ షేడ్స్ కాదు.. డ్యూయల్ రోల్ అని కూడా టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సివుంది.

ఇక విలన్ విషయానికి వస్తే.. ఇది తెలుగు, తమిళ్ లో రూపొందుతోన్న ద్విభాషా చిత్రం. కాబట్టి ఈ సినిమాలో విలన్ పాత్రకు కోలీవుడ్ హీరోని తీసుకోవాలని డైరెక్టర్ లింగుసామి ఫిక్స్ అయ్యారని.. కొంత మంది తమిళ హీరోల పేర్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా ఆర్య అయితే.. కరెక్ట్ గా ఉంటుందని.. ఆయన్నే ఫిక్స్ చేసారని తెలిసింది. ఆర్య గతంలో అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించారు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేయడానికి ఆర్య ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్