కేంద్ర ప్రభుత్వం – తమిళనాడు మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాత్రమె కేంద్రంతో తలపడుతున్నారు. తాజాగా తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా కేంద్రాన్ని నిలదీసేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటి వరకు మెడికల్ పరీక్ష నీట్ రద్దు చేయాలని కోరిన సిఎం స్టాలిన్ ఇప్పుడు కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు.
విద్యా విధానాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ‘విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి.
అప్పుడే నీట్ లాంటి క్రూరమైన పరీక్షలను రద్దు చేయవచ్చు’ అని తెలిపారు. రాష్ర్టాల సమూహారమే దేశమన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపట్టాలని అధికార డీఎంకే ప్రణాలికలు సిద్దం చేస్తోంది.