Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: తమిల్ తలైవా విజయం

ప్రొ కబడ్డీ: తమిల్ తలైవా విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో తమిల్ తలైవా యూపీపై విజయం సాధించింది. యూ ముంబా- హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది.

హర్యానా స్టీలర్స్ – యూ ముంబా  మధ్య జరిగిన తొలి మ్యాచ్ 24-24తో  టై అయ్యింది. తొలి అర్ధ భాగంలో హర్యానా ­­12-10 తో ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధ భాగంలో యూ ముంబా ­ 14-12 తో పైచేయిగా నిలిచింది. దీనితో మ్యాచ్ డ్రా అయ్యింది.

తమిల్ తలైవాస్- యూపీ యోధ మధ్య జరిగిన  రెండో మ్యాచ్ లో తమిళ్ జట్టు 39-33 తో విజయం సాధించింది. ఆట తొలి భాగంలో తలైవాస్ 21-10 తో  భారీ ఆధిక్యం సంపాదించారు. రెండో అర్ధభాగంలో యూపీ పుంజుకుని ఆడింది. ఆట చివరి ఐదు నిమిషాల్లో తలైవాస్ ను ముప్పు తిప్పలు పెట్టి వరుస పాయింట్లు సంపాదించింది. సెకండ్ హాఫ్ లో 23-18 తో యూపీ ఆధిక్యం సంపాదించినా ఆరు పాయింట్లతో ఓటమి చవి చూసింది. యూపీ ఆటగాడు సురేందర్ గిల్ 14 పాయింట్లతో రాణించాడు.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు 23 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా… ఢిల్లీ (21); పాట్నా పైరేట్స్ (21); యూ ముంబా(20); తమిళ్ తలైవాస్ (19); బెంగాల్ వారియర్స్  (16);  ; జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ:  టైటాన్స్ కు కలిసిరాని అదృష్టం

RELATED ARTICLES

Most Popular

న్యూస్