Tuesday, March 10, 2026
Homeజాతీయంప్రత్యక్ష రాజకీయాల్లోకి గవర్నర్ తమిళిసై

ప్రత్యక్ష రాజకీయాల్లోకి గవర్నర్ తమిళిసై

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు గవర్నర్ తమిళిసై సిద్దమయ్యారు. తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందర్‌రాజన్‌ సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సెంట్రల్‌ లేదా తుత్తుకూడి నుంచి బీజేపీ టికెట్‌ తో బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేశారు.

గతకొంత కాలంగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. వివిధ సందర్భాల్లో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్ చాట్ లో లోక్ సభకు పోటీ పై ఆసక్తి ఉన్నట్టు  తమిలిసై వెల్లడించారు.

2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణకు గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. దీంతో ఈ పదవిని నిర్వహించిన తొలి మహిళగా నిలిచారు. ఆతర్వాత పుదుచ్చేరి ఇంచార్జ్ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కాగా, తమిళిసై సౌందర రాజన్ 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. బీజేపీలో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వెలచ్చేరి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular