Saturday, January 18, 2025
Homeసినిమావెనకడుగు వేయని 'తంగలాన్'

వెనకడుగు వేయని ‘తంగలాన్’

ఈ ఆగస్టు 15న మూడు భారీ సినిమాలు థియేటర్లలో దిగిపోతున్నాయి. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ..  రామ్ ‘డబుల్ ఇస్మార్ట్ ‘ .. విక్రమ్ ‘తంగలాన్’ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు సినిమాలపై ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. రవితేజకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అలాగే హరీశ్ శంకర్ నుంచి ఇంతకుముందు వచ్చినవన్నీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్లే. అందువలన మాస్ ఆడియన్స్ ఈ సినిమా పట్ల చాలా కుతూహలంతో ఉన్నారు. ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ ఇవ్వనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

పూరి జగన్నాథ్ .. రామ్ కాంబినేషన్లో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లోనే ప్రేక్షకులను పలకరించనుంది. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ఆడియన్స్ కి కావలసిన మసాలాను అందించడంలో సక్సెస్ అయింది. అందువలన సహజంగానే ఈ సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సంజయ్ దత్ విలనిజం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనుంది. మణిశర్మ మేజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలోనే తమిళంలో విక్రమ్ చేసిన ‘తంగలాన్’ .. అదే పేరుతో ఇక్కడ కూడా విడుదలవుతోంది. ఇక్కడ గట్టిపోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా వెనకడుగు వేయకపోవడం విశేషమే.  బ్రిటీష్ వారి కాలంలో .. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కొండజాతి ప్రాంతానికి చెందిన గిరిజనుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. మాళవిక మోహనన్ – పార్వతి తిరువోతు కీలకమైన పాత్రలలో కనిపించనున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఈ మూడు సినిమాలలో ఏది ఎక్కువగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్