Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్WPL: బెంగుళూరుపై ఢిల్లీ విజయం

WPL: బెంగుళూరుపై ఢిల్లీ విజయం

విమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) లో భాగంగా నేడు జరిగిన రెండో మ్యాచ్ లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పై ఢిల్లీ కాపిటల్స్ 60 పరుగులతో విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్ తారా నోరిస్ ఐదు వికెట్లతో సత్తా చాటింది. ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో  బెంగుళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ- కెప్టెన్ మెగ్ లన్నింగ్ తొలి వికెట్ కు 162 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. లన్నింగ్ 43 బంతుల్లో 14 ఫోర్లతో ­72; షఫాలీ 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఔటయ్యారు. మరిజాన్ కాప్ 17 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 39; జెమైమా రోడ్రిగ్యూస్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఢిల్లీ నిర్ణీత 20  ఓవర్లలో 2 వికెట్ల  నష్టానికి 223  పరుగులు చేసింది.

బెంగుళూరు బౌలర్ హెడర్ నైట్ కే రెండు వికెట్లూ దక్కాయి.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు ఆరంభం బాగానే ఉన్నా 41 వద్ద ఓపెనర్ సోఫీ డివైన్ (14) వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే కెప్టెన్ స్మృతి మందానా (35) కూడా పెవిలియన్ చేరింది. అమెరికన్ ప్లేయర్ తారా నోరిస్ ఐదు వికెట్లతో రాణించి బెంగుళూరు బ్యాటింగ్ ను దెబ్బతీసింది. హైదర్ నైట్-34; మేగాన్ స్కట్-30 పరుగులతో రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేయగలిగింది.

తారా నోరిస్ 5;  ఆలీస్ క్యాప్సీ 2; శిఖా పాండే ఒక వికెట్ పడగొట్టారు.

నోరిస్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్