Sunday, January 19, 2025
HomeTrending Newsఆ రెండు కోరికలు తీరకుండానే వెళ్లిపోయిన తారకరత్న

ఆ రెండు కోరికలు తీరకుండానే వెళ్లిపోయిన తారకరత్న

నందమూరి తారకరత్న హీరోగా ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ ను సృష్టించారు. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్ కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్పచ్చు. అయితే.. హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు కానీ.. ‘అమరావతి’ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. నంది అవార్డ్ సైతం దక్కించుకున్నారు. ఇటీవల వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఆయన నటించిన రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.

అయితే.. ఆయన రెండు కోరికలు తీరకుండా వెళ్లిపోయారు. ఏంటా రెండు కోరికలు అంటే.. తారకరత్నకు బాబాయ్ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. బాల బాబాయ్ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఒక్క సీన్ లో అయినా నటించాలి అనేది తన కోరిక అని ఇటీవల కూడా ఓ ఇంటర్ వ్యూలో చెప్పడం జరిగింది. ఈ కోరిక తీరలేదు. ఇక రెండో కోరిక ఏంటంటే.. రాజకీయాల్లోకి ప్రవేశించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలి.. ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడుకు చెప్పడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకున్నారు.

అందుకనే నారా లోకేష్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయన గుండెపోటుకి గురికావడం జరిగింది. పరిస్థితి విషమించడంతో బెంగుళూరు నారాయణ హృదయాలయకి తరలించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న అతనికి డాక్టర్లు అత్యానిదుక వైద్యం అందించారు. అయితే.. తిరిగి మామూలు స్థితికి రాలేదు. ఇక మరోసారి పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నటుడుగా బాబాయ్ తో కలిసి నటించాలి అనే కోరిక, రాజకీయాల్లో ప్రవేశించి ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక.. ఈ రెండు కోరికలు తీరకుండా తారకరత్న వెళ్లిపోవడం వెళ్లిపోయారు.

Also Read :మృత్యువుతో పోరాడి ఓడిన తారకరత్న  

RELATED ARTICLES

Most Popular

న్యూస్