Sunday, March 15, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ప్రోటోకాల్ పాటించరా? అచ్చెన్నాయుడు

ప్రోటోకాల్ పాటించరా? అచ్చెన్నాయుడు

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెత్తనం సాగించడం దుర్మార్గం అని అయన అభివర్ణించారు. అధికారం ముసుగులో వైఎస్సార్సీపీ అరాచకం ఎక్కువైందని అయన విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికైన తమ పార్టీ ప్రజా ప్రతినిధులను కూడా విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతలు పెడుతూ అసలైన అర్హులకు అందకుండా చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం ఘోరమైన వైఫల్యం చెందిందని, దీనిపై తమ పార్టీ నాయకులు ఆందోళనలు చేస్తుంటే వారిని అరెస్టు చేస్తున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, వాటిని మరమ్మతులు చేయాలని కోరితే మాపైనే ఎదురు దాడి చేస్తున్నారని అయన ఆక్షేపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular