Friday, November 22, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అన్న క్యాంటిన్లు తెరవాలి : రామ్మోహన్ డిమాండ్

అన్న క్యాంటిన్లు తెరవాలి : రామ్మోహన్ డిమాండ్

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరాపు రాంమ్మోహన్ నాయుడు ఆరోపించారు. కరోనాతో నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన మరణాలు ప్రభుత్వ హత్యలుగానే భావించాలన్నారు.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎందరో నిరుపేదలకు అన్నం పెట్టిన అన్న క్యాంటిన్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సిఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలండర్ బూటకమని, ఓట్ల కోసం జగన్ యువతను మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలోనూ జగన్ మాట తప్పి, మడమ తిప్పారంటూ రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్