వ్యక్తిత్వ హననం చేస్తున్నారు: వంశీ

తెలుగుదేశం పార్టీ నేతలను తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. నియోజకవర్గంలో తన పని తాను చేసుకుంటున్నానని, గెలవాలన్నా, ఓడిపోవాలన్నా ఇక్కడి ప్రజలు తీర్పు ఇవ్వాలని స్పష్టం చేశారు. కొడాలి నాని, తనపై ఐ-టిడిపి పేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లలో నీచాతి నీచంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి సమయంలో తాను అక్కడ లేనని… తమపై చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెందిన కొందరు అభిమానులు దాడికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

తాను మొదట వారిని ఏమీ అనలేదని, వారు తనను పరుష పదజాలంతో విమర్శలు చేసిన తర్వాతే స్పందించాల్సి వచ్చిందని వంశీ వెల్లడించారు, పిల్ల సైకో అంటూ తనపై వారు మాట్లాడితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబును గారూ అనే తాను మాట్లాడానని, వారు దిగజారి విమర్శలు చేస్తుంటే తిరిగి అలా స్పందించానన్నారు.

నాని, తన కుటుంబ సభ్యులపై కూడా చెప్పడానికి వీల్లేని భాషతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని వంశీ ఆవేదన వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *