Friday, April 19, 2024
HomeTrending NewsYS Jagan: టిడిపి మేనిఫెస్టో బిసిబిల్లా బాత్: సిఎం జగన్

YS Jagan: టిడిపి మేనిఫెస్టో బిసిబిల్లా బాత్: సిఎం జగన్

తెలుగుదేశం నిర్వహించిన మహానాడును ఓ డ్రామా షో అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 27 ఏళ్ళ క్రితం తాము వెన్నుపోటు పొడిచి చంపేసిన వ్యక్తిని ఇప్పుడు శక పురుషుడు అని, యుగ పురుషుడని, రాముడని, కృష్ణుడు అని కీర్తిసూ ఆయన ఫొటోకు దండ వేశారని మండిపడ్డారు.

కర్ణాటకలో కాంగ్రెస్, బిజెపి మేనిఫెస్టోలను కలిపి ఓ బిసిబిల్లా బాత్ వండేశారని, అంతటితో సరిపోదని తమ అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత పథకాలు కలిపి పులిహోర వండారని…. అసలు బాబు బతుకే కాపీ, మోసం అని ఎద్దేవా చేశారు.  ‘ఒరిజినాలిటీ లేదు… పర్సనాలిటీ లేదు… క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ లేదు…175 నియోజకవర్గాల్లో అన్నిటికీ అభ్యర్ధులే లేరు’ అంటూ విమర్శించారు. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ అది… విలువలు- విశ్వసనీయథ లేని పార్టీ… కేవలం పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు మాత్రమే నమ్ముకున్న పార్టీ అంటూ మండిపడ్డారు.

మేనిఫెస్టోను ఆకర్షణీయం అని  టిడిపి నేతలు సంబోధించడం దారుణమన్నారు. పసిపిల్లవాడైన కృష్ణుడిని చంపడం కోసం మారువేషంలో… బాబు చెబుతోన్న అందమైన మేనిఫెస్టో రూపంలోప్ వచ్చిన పూతన అనే రాక్షసి… అందమైన వేషంలో సీతమ్మ వద్దకు వచ్చిన మారీచుడు, అదే సీతమ్మను ఎత్తుకువెళ్లేందుకు భవతి భిక్షాం దేహి అని వచ్చిన రావణాసురుడు… ఈ ముగ్గురు ఆత్మలూ కలిపి ఏపీలో ఒక వ్యక్తిగా నారా చంద్రబాబు రూపంలో జన్మించారని దుయ్యబట్టారు. ‘ మేనిఫెస్టో పేరిట ప్రతి ఎన్నికకు ఒక వేషం, వాగ్ధానానికో మోసం.. బాబు సత్యం పలకడు, ధర్మానికి కట్టుబడడు, మాట మీద నిలబడడు, విలువలు విశ్వసనీయత అసలే లేవు’ అని బాబుపై నిప్పులు చెరిగారు.

పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అయినా సరే, ఎన్నికల తర్వాత ప్రజలనైనా సరే వెన్నుపోటు పొడుస్తాడని..  అధికారం కోసం ఎంతకైనా దిగాజారతారని ‘ఎన్నికల ముందు ఆకర్షణీయమైన మేనిఫెస్టో – ఆ తర్వాత ప్రజలను వెన్నుపోటు పొడవడం’ ఆయన రాజకీయ ఫిలాసఫీ  అని ధ్వజమెత్తారు. కానీ ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, వారి గుండె చప్పుడు నుంచి తమ పార్టీ మేనిఫెస్టో పుట్టిందన్నారు.

1995లో సిఎం అయిన చంద్రబాబు 30 ఏళ్ళ తరువాత కూడా తనకు ఇంకో చాన్స్ ఇవ్వండి ఏదో చేస్తా అంటూ అడుగుతున్నారు కానీ సిఎం గా ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. బాబు మళ్ళీ కొంగజపం మొదలుపెట్టారన్నారు. మంచి చేయడం ఆయన డిక్షనరీలోనే లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్