Monday, June 8, 2026
HomeTrending Newsఉద్యోగుల పోరాటానికి మద్దతు: యనమల

ఉద్యోగుల పోరాటానికి మద్దతు: యనమల

We support: పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గంగా ఉందని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి బాటలు వేస్తే ఈ ప్రభుత్వం వారి సంక్షేమానికి బీటలు కొట్టేలా నాలుగు జీవోలు తీసుకువచ్చిందని విమర్శించారు.

అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సులు ఏమయ్యాయని, ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్  ఇవ్వడం చరిత్రలో ఎప్పుడైనా ఉందా అంటూ యనమల ప్రశ్నించారు. తమ హయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం 62  జీవోలు ఇచ్చామని, విభజన ఇబ్బందులు ఉన్నా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తు చేశారు.

ఉద్యోగుల పీఆర్సీ విషయంలో విడుదల చేసిన జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని యనమన డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేయబోయే పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు.

Also Read : ఈ పీఆర్సీ మాకొద్దు : ఉద్యోగ సంఘాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular