Thursday, March 19, 2026
HomeTrending Newsరాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల

రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థ: యనమల

TDP on CPS: రాష్ట్రంలో బుల్డోజర్ వ్యవస్థను తెచ్చేందుకు సిఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీపీఎస్ సాధన కోసం ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రజాస్యామ్యం కల్పించిన ప్రాథమిక హక్కులను సిఎం జగన్ కాలరాస్తున్నారని, ఎనికల్లో ఇచ్చిన హామీ అమలు కోసమే వారు  డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.  ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద కాపలా పెట్టారని, మరుగుదొడ్లు కడిగించారని, బయో మెట్రిక్ పేరుతో వేధించారన్ని మండిపడ్డారు.

సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారని, ఆ హామీని జగన్ మర్చిపోయినా ఉద్యోగులు మర్చిపోలేదని, ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తోందని  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Also Read : ఇది సమంజసం కాదు: యుటిఎఫ్ ఆందోళనపై బొత్స

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular