Babu Condemned: శాసన మండలి సభ్యుడు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు అరెస్టును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అశోక్ బాబుపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. పాత కేసును తిరగదోడి ఇప్పుడు అరెస్టు చేయడం ఏమిటని మండిపడ్డారు. జగన్ తాను చేస్తున్న ప్రతి తప్పుకూ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. యువనేత నారా లోకేష్ కూడా అరెస్టును ఖండించారు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని విమర్శంచారు.
పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న అభియోగాలపై గురువారం రాత్రి పొద్దుపోయాక అశోక్ బాబు ను విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వేడుకకు హాజరై పటమటలంకలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే సీఐడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్ అయ్యారు. అయితే… డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు. దీనిపై విజిలెన్స్ అధికారులు కూడా విచారణ జరిపి… ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఈ కేసు మూసివేశారు. ఈ విషయంలో తాజాగా ప్రభుత్వానికి అందిన ఫిర్యాదు మేరకు… విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది. దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయింది. ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే తనపై లోకాయుక్తకు కొత్తగా ఫిర్యాదు చేయించినట్లు అశోక్‌బాబు ఆరోపించారు. అశోక్ బాబు ను సిఐడి పోలీసులు గుంటూరు కు తరలించారు.
Also Read : ఉద్యోగులు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు: అశోక్ బాబు