Monday, May 20, 2024
Homeసినిమామహేష్ చేతుల మీదుగా అజిత్‌ ‘వాలిమై’ థియేట్రికల్ ట్రైలర్

మహేష్ చేతుల మీదుగా అజిత్‌ ‘వాలిమై’ థియేట్రికల్ ట్రైలర్

Valimai: అజిత్ కుమార్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్‌ ‘వాలిమై’ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 24న విడుద‌ల చేస్తున్నారు. జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంస్థలు. సంయుక్తంగా బోనీకపూర్‌ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న నేపధ్యంలో తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ.. తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ కూడా ఒకే సారి విడుదల చేస్తున్నాం. వాలిమై తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశాం.  అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే గ్రాండ్ విజువల్స్ తో చిత్రం ఆద్యంతం ఉంటుంది. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఓ పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తాడు”.

“హీరో అజిత్‌కి బైక్స్, బైక్ రైడ్స్ అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డూప్ సహాయం లేకుండా తన సినిమాల్లో స్టంట్స్, ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు షూటింగులో గాయపడ్డారు కూడా. అయినా సరే.. ఏ మాత్రం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎంత కష్టపడ్డారు.? అనేది చిత్రం చూసిన తరువాత ఆడియ‌న్స్‌కు అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ కీలక మైన పాత్రలో నటించారు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్