Assure to Entertain: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా డిజె టిల్లు. ఈ సినిమాను ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. డెబ్యూ డైరెక్టర్ విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ నెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది డిజె టిల్లు. ఈ సంద‌ర్భంగా  హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలోఈ మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమం వేడుకగా, ఆద్యంతం వినోదాత్మకంగా నిర్వహించారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ… “డిజె టిల్లు సినిమాతో నేను ఇప్పటిదాకా వినని పదాలు వింటున్నాను. టికెట్ బుకింగ్స్, బ్రేక్ ఈవెన్, థియేట్రికల్ రైట్స్ అమ్మకం, ఓవర్సీస్ లో బుకింగ్స్.. ఇవన్నీ నాకు కొత్తగా ఉన్నాయి. గుంటూర్ టాకీస్ తో పని అవుతుందని అనుకున్నాను కానీ మిస్ అయ్యింది. చిన్న గ్యాప్ వచ్చింది. డిజె టిల్లు చుట్టూ ఒక బజ్ క్రియేట్ అయ్యింది. 12న మీరు థియేటర్ కు వస్తారు. సినిమా చూస్తారు ఎంజాయ్ చేస్తారు. మిమ్మల్ని మేము నవ్విస్తాం. సితార సంస్థలో పని చేయడం గర్వంగా ఉంది. నిర్మాత వంశీ గారు సినిమాకు కావాల్సింది చేసుకో అన్నారు. త్రివిక్రమ్ గారు మాకు మార్గదర్శిలా ఉన్నారు. థమన్ తో పని చేయడం ఒక మంచి అనుభవం. శ్రీ చరణ్ చక్కటి కాంట్రిబ్యూషన్ చేశారు” అన్నారు.

Also Read : డిజె టిల్లు’ కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ : నాగవంశీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *