Friday, April 19, 2024
HomeTrending Newsధరలు దిగిరావాలి- జగన్ దిగిపోవాలి

ధరలు దిగిరావాలి- జగన్ దిగిపోవాలి

TDP to Protest: నిత్యావసర ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ‘ధరలు దిగి రావాలి – జగన్ దిగిపోవాలి’ పేరిట ఆందోళన నిర్వహించనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో  చంద్రబాబు సమావేశమయ్యారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మైనింగ్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బాబు పిలుపు ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమం మైనింగ్ జరుగుతోందని, తక్షణమే పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని బాబు డిమాండ్ చేశారు.  మైనింగ్, మద్యం, ఇసుక, భూముల్లో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. తమ వైఫల్యాలకు సమాధానం చెప్పలేకనే జగన్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడిందని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై కూడా బాబు స్పందించారు. వెంటనే పీఆర్సీని పునః సమీక్షించాలన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 న జాబ్  క్యాలండర్ విడుదల చేస్తానన్న జగన్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.

Also Read : ఏపీలో నైట్ కర్ఫ్యూ

RELATED ARTICLES

Most Popular

న్యూస్