Wednesday, May 7, 2025
HomeTrending NewsMLC Elections: టిడిపి ఖతాలోనే పశ్చిమ ‘సీమ’

MLC Elections: టిడిపి ఖతాలోనే పశ్చిమ ‘సీమ’

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం హ్యాట్రిక్ సాధించింది.  ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాలు), తూర్పు రాయలసీమ (ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు) స్థానాలను నిన్ననే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-చిత్తూరు జిల్లాలు) స్థానంలో నిన్న మొదటి ప్రాధాన్యతా ఓటు పూర్తయ్యే సమయానికి ఆధిక్యంలో ఉన్న వైసీపీ అభ్యర్ధి… రెండో ప్రాధాన్య ఓటు లెక్కింపు సమయానికి వెనకబడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరువేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు తెలుస్తోంది.  అయితే ఎన్నికల కమిషన్ ఈ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్