Saturday, February 1, 2025
Homeస్పోర్ట్స్Team India For world Cup: 15 మందితో జట్టు- బుమ్రాకు చోటు

Team India For world Cup: 15 మందితో జట్టు- బుమ్రాకు చోటు

ఐసిసి వన్డే వరల్డ్ కప్-2023 కోసం 15 మందితో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. ఇండియా ఈ మెగా టోర్నీకి  ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే.  అక్టోబర్ 5న ప్రారంభం కానున్న వరల్డ్ కప్ నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది.

జట్టులో ఎలాంటి భారీ మార్పులూ చోటు చేసుకోలేదు. అయితే స్పిన్నర్ గా అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్; కొంత కాలంగా ఫామ్ లో లేని కెఎల్ రాహూల్ బదులు సంజూ శామ్సన్ ను తీసుకుంటారని క్రీడా విశ్లేషకులు భావించినా  అలా జరగలేదు.

రోహిత్ శర్మ సారధ్యం లోనే ఇండియా ఆడనుంది, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్