Nia Officers Searches In Telugu States :
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారుల బృందం విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతల ఇండ్లలో ఈ రోజు వేకువ జాము నుంచే కొనసాగుతున్న సోదాలు. హైదరాబాదు నాగోలులో మాజీ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లోన్గోపోయిన రవిశర్మ, అనురాధ ఇంటిలో, అల్వాల్ సుభాష్ నగర్ లో అమరుల బందు మిత్రుల సంఘం నేత పద్మ కుమారి ఇంటిలో సోదాలు చేస్తున్నారు. అటు ఒంగోలులో పౌర హక్కుల సంఘం నేత కళ్యాణ్ రావు ఇంట్లో కొనసాగుతున్న సోదాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ప్రభుత్వం – మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కళ్యాణ్ రావు పాల్గొన్నారు. విశాఖపట్నంలో అన్నపూర్ణ ఇంట్లో కొనసాగుతున్న సోదాలు. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్న ఎన్ఐఏ. ఇటీవల కాలంలో ఆర్కె జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురణపై ఆరా తీస్తున్న NIA అధికారుల బృందం.
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మావోల కదలికలు పెరిగాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య తరచుగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వీరికి తోడు పట్టణ ప్రాంతాల్లో నక్సల్ సానుభూతిపరుల కార్యక్రమాలు పెరుగుతున్నాయని, వీటిని ఆదిలోని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది.
Also Read : గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్