యంగ్ టాలెంటెడ్ హీరోస్ శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘తీరం’. అఖి క్రియేటివ్స్ వర్క్స్, యల్.యస్. ప్రొడక్షన్స్ బ్యానర్లపై అనిల్ ఇనమడుగు దర్శకత్వంలో యం. శ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘తీరం’ అక్టోబర్ 29న విడుదల కానుంది. ఈ సందర్బంగా ప్రీ – రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.
హీరో కమ్ డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ “ఎంతో కష్టపడి మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా రియాలిస్టిక్ గా టెక్నికల్ ఈక్విమెంట్స్ ఏమి వాడకుండా నేచురల్ గా సినిమా చేశాం. అలాంటి టైంలో మా నిర్మాత శ్రీనివాస్ గారు ఇచ్చిన సపోర్ట్ మరువలేనిది. ఆయన వల్లే సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయగలుగుతున్నాం. అలాగే సినేటెరియా వెంకట్ గారు థియేటర్స్ అన్ని మాట్లాడి సెట్ చేస్తున్నారు. ఆయనకి స్పెషల్ థాంక్స్. ఈ సినిమా తర్వాత ఇందులో నటించిన ప్రతి ఆర్టిస్ట్ గొప్ప పేరొస్తుంది. అందరం కలిసి ఒక దమ్మున్న సినిమా చేశాం. ప్రేక్షకులకు గ్యారెంటీగా ఈ సినిమా నచ్చుతుంది” అన్నారు.
మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ “సినిమా ఛాన్సుల కోసం వెతుకుతున్ననాకు అనిల్ ఒక మంచి అవకాశం ఇచ్చాడు. తీరం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఖచ్చితంగా ఇది దమ్మున్న సినిమా. ఎవరికైనా నచ్చకపోతే నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో వారి అభిప్రాయం చెప్పొచ్చు” అన్నారు. తీరంలో ఒక మంచి పాత్ర పోషించాను. అనిల్ నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు హీరోయిన్ క్రిస్టెన్ రవళి.
నిర్మాత యం. శ్రీనివాసులు మాట్లాడుతూ “అంతా కొత్త వాళ్ళు కలిసి తీసిన ఈ తీరం సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కేవలం అనిల్ వాళ్ళ టీమ్ మీద నమ్మకంతో ఈ సినిమా చేశాను. ప్రశాంత్ మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ ది ఎస్సెట్ అవుతుంది. డెఫినెట్ గా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సినేటెరియా వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేణు, పైనాన్షియర్ సుధాకర్ రెడ్డి.. సినిమా ప్రేక్షకులందరికి నచ్చేవిధంగా అనిల్ రూపొందించారు. తప్పకుండా ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది” అని అన్నారు.