ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ కు సమస్యలు పెరిగాయి. తాలిబాన్ అనుకూల సంస్థలు వివిధ రకాల పేర్లతో పాకిస్తాన్ లో కార్యాక్రమాలు నిర్వహించటం, పాక్ లో ఇస్లాం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడటం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అందులో హక్కని నెట్వర్క్, తెహ్రేక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ , మోజహిదిన్, స్వాత్ తాలిబాన్ తదితర గ్రూపుల పేరుతో వివిధ సంస్థలు ఉండగా టిటిపి సానుభూతిపరులు చురుకుగా ఉన్నారు. ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ లాహోర్, పెషావర్, ఇస్లామాబాద్ లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి కూడా వీరికి మద్దతు లభిస్తోంది. తాజాగా పెషావర్ సమీపంలోని షండు ప్రాంతంలోని పోలీస్ చెక్ పోస్టుపై గ్రెనేడ్ దాడులు బీభత్సం సృష్టించాయి. నలుగురు పోలీసులతో పాటు అనేక మంది గాయపడ్డారు. ఆ దాడులు చేసింది తామేనని టిటిపి ప్రకటించింది. అంతకు ముందు వజిరిస్తాన్ ప్రాంతంలో కూడా దాడులు చేశారు. టిటిపి అధికారిక కార్యక్రమాల కోసం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని లాహోర్ లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అది బల ప్రదర్శన కోసమే చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం టిటిపి పాకిస్తాన్ తీవ్రవాద నిషేదిత జాబితాలో ఉంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం తెహ్రేక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ తో సయోధ్య కుదుర్చుకునేందుకు సిద్దమైంది. ఇటీవల ఇస్లామాబాద్ తో సహా పంజాబ్ , ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రాల్లో టిటిపి హింసాత్మక కార్యకలాపాలు పెరిగాయి. టిటిపితో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకునే దిశగా సుమారు 50 మంది టిటిపి ఖైదీలను జైళ్ళ నుంచి పాకిస్తాన్ విడుదల చేసింది. అయితే తమ ముఖ్య నాయకులను విడుదల చేస్తేనే కాల్పుల విరమనపై నిర్ణయం తీసుకుంటామని టిటిపి నేతలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో తేల్చి చెప్పారు. పాకిస్తాన్ లో సుమారు పది వేల మంది ముఖ్యమైన వ్యక్తులతో టిటిపి నెట్వర్క్ నడుస్తోంది. స్వాత్ లోయకు చెందిన అనేకమంది నేతలను పాకిస్తాన్ చెరసాలలో పెట్టిందని వారందరినీ విడుదల చేయాలని టిటిపి తెగేసి చెపుతోంది.
Also Read : పాకిస్తాన్లో బిహారీల కష్టాలు