Sunday, January 19, 2025
Homeసినిమా‘అహింస‌’ నా ఆయుధమంటున్న అభిరామ్

‘అహింస‌’ నా ఆయుధమంటున్న అభిరామ్

No Violence: తన సుదీర్ఘమైన‌ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌లను అందించి, తన చిత్రాలతో ఎందరో ప్రతిభావంతులైన నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు తేజ,  మూవీ మొగల్ డి రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు మరియు రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై  పి కిరణ్‌ నిర్మిస్తున్నారు.

ఈ రోజు దర్శకుడు తేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్, ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘అహింస’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ ప్రీ – లుక్ పోస్టర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమా పై క్యూరియాసిటీ ఏర్పడింది. ఈ చిత్రానికి ఆర్.పి ప‌ట్నాయ‌క్ సంగీతం అందిస్తున్నారు. తేజ‌, ఆర్.పి. ప‌ట్నాయ‌క్ కాంబినేష‌న్  సక్సెస్ ఫుల్ కాంబినేష‌న్.  చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు క‌లిసి వ‌ర్క్ చేస్తుండ‌డం విశేషం. అహింస షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

Also Read : ‘నందమూరి బాలకృష్ణ 107’ ఫస్ట్ లుక్‌ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్