Monday, June 8, 2026
Homeసినిమా‘నందమూరి బాలకృష్ణ 107’ ఫస్ట్ లుక్‌ విడుదల

‘నందమూరి బాలకృష్ణ 107’ ఫస్ట్ లుక్‌ విడుదల

Another Mass: నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ విడుదలైంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నెవర్‌ సీన్‌ బిఫోర్‌’ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా డిజైన్‌ చేశారు ఈ సినిమాను. అయితే.. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మాస్‌ లోడెడ్‌ అవతార్‌లో బాలకృష్ణ లుక్‌ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ముఖంలో ఇంటెన్సిటీ, మెడలో రుద్రాక్ష మాల, పంచెకట్టుతో స్టైలిష్‌ నడకతో మెప్పిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. నల్ల చొక్కా, బ్రౌన్‌ పంచెకట్టుతో చూడగానే మెప్పిస్తుంది ఆయన ఫస్ట్ లుక్‌. వాచ్, రింగ్‌, కళ్లజోడు.. ఇవన్నీ ఆయన ఆహార్యానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. పక్కా మాస్‌ అండ్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ నాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సిరిసిల్లలో యాక్షన్‌ ఎపిసోడ్‌తో షూటింగ్‌ మొదలుపెట్టారు. రామ్‌-లక్ష్మణ్‌ కంపోజ్‌ చేసిన హై ఇంటెన్స్ ఫైట్‌ అద్భుతంగా వచ్చిందంటున్నారు మేకర్స్. శాండల్‌వుడ్‌ స్టార్‌ దునియా విజయ్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. అఖండ సినిమాకు తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గట్టి ఎలివేషన్‌ ఇచ్చిన తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సాయిమాధవ్‌ బుర్రా డైలాగులు రాస్తున్న ఈ సినిమాకు నవీన్‌ నూలి ఎడిటర్‌. ఎ.ఎస్‌.ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular