Tuesday, September 24, 2024
Homeసినిమాతేజస్వి తాజా చిత్రం సర్కస్ కార్-2

తేజస్వి తాజా చిత్రం సర్కస్ కార్-2

Tejaswi In Lead Role In The Film Circus Car 2 :

యువ ప్రతిభాశాలి నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘సర్కస్ కార్-2’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా తేజస్వి  నటిస్తోంది. ఈ సినిమాపై ఆమె మాట్లాడుతూ “నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన “సర్కస్ కార్” చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. “సర్కస్ కార్-2″లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్” అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్యపాత్రలో ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ క్రేజీ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు ప్రేక్షకుల పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే ‘సర్కస్ కార్-2’ మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్, తేజస్వి మదివాడ, ఆషు రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది” అన్నారు.

బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి), నిర్మాత: శివరాజు వి.కె, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్.

Also Read : కారు సృష్టించే కలకలం నేపథ్యంలో ‘సర్కస్ కార్-2’

RELATED ARTICLES

Most Popular

న్యూస్