Friday, March 29, 2024
Homeసినిమాకారు సృష్టించే కలకలం నేపథ్యంలో ‘సర్కస్ కార్-2’

కారు సృష్టించే కలకలం నేపథ్యంలో ‘సర్కస్ కార్-2’

Circus Car 2 Shooting At Maredumilli Forest Area :

ఒక రోజు తెల్లారేసరికి ఆ ఊరి పొలిమేరల్లో ఓ కారు కనిపిస్తుంది. ఎన్నిరోజులు గడిచినా ఆ కారు సొంతదారు ఎవరో తెలియదు. ఆ ఊరి వారిని సదరు కారు ముప్పుతిప్పలు పెడుతుంటుంది. ఆ కారును ఆశ్రయించి ఉన్న అతీంద్రియ శక్తుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? ఎన్ని పాట్లు పడ్డారు? లాంటి ఆసక్తికర కథ, కథనాలతో రూపొందుతున్న హారర్ ఎంటర్టైనర్ ‘సర్కస్ కార్-2’. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కూడా ఆయనే రూపొందిస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

శివరాజు వి.కె మాట్లాడుతూ “సర్కస్ కార్ సాధించిన ఘనవిజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే ఈ సినిమా దర్శకుడికి మరింత మంచి పేరు తెస్తుంది.  పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ ‘సర్కస్ కార్-2’కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు.

బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి)

Also Read : సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు : సురేష్ బాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్