Saturday, June 6, 2026
HomeTrending Newsప్రభుత్వ హెల్త్‌ యాప్‌ తో అరచేతిలో ఆరోగ్యం

ప్రభుత్వ హెల్త్‌ యాప్‌ తో అరచేతిలో ఆరోగ్యం

రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య వివరాలు, డయాగ్నస్టిక్‌ సెంటర్ల వివరాలు, పరీక్షల వివరాలు తమ మొబైల్‌ ఫోన్‌లో చూసుకొనే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రతి ఒక్కరి ఆరోగ్యనివేదికలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రభుత వైద్యశాలలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో ఎక్కడైనా ఒకచోట పరీక్షలు చేయిస్తే, ఆ పరీక్షల రిపోర్టుల వివరాలు ఇందులో అప్‌లోడ్‌ చేస్తారు.

ఆ తర్వాత ఏ దవాఖానకు వెళ్లినా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. ఆ రిపోర్ట్‌ల ఆధారంగా డాక్టర్లు వైద్య సేవలు అందిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ యాప్‌ను మొబైలో డౌన్‌లోడ్‌ చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే.. తెలంగాణ డయాగ్నస్టిక్ప్‌ వ్యక్తిగత ఆరోగ్య రిపోర్ట్‌ యాప్‌ను  వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితతో కలిసి ఇటీవలే ప్రారంభించారు.

తెలంగాణ డయాగ్నస్టిక్‌ యాప్‌ ప్రత్యేకతలు
———————————
★ ఈ యాప్‌ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య
వివరాలు తెలుసుకోవచ్చు

★ వైద్య పరీక్షల వివరాలు, రిపోర్టులను
డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

★ దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖాన
వివరాలు తెలుసుకోవచ్చు

★ పరీక్షలను బట్టి అందుబాటులో ఉన్న
దవాఖానను ఎంచుకోవచ్చు

★ వైద్యులు, నర్సులు, సిబ్బంది,
ఆశా సిబ్బంది, ఆసుపత్రుల సేవలపై

★ అభిప్రాయాన్ని యాప్‌లో నమోదు చేయవచ్చు.

★ వైద్యసేవలపై అసౌకర్యం కలిగితే
ఫిర్యాదు చేయవచ్చు

★ జరుగుతున్న వైద్య పరీక్షల
స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular