Thursday, March 19, 2026
HomeTrending Newsబైంసా RSS మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బైంసా RSS మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నిర్మల్ జిల్లా బైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మార్చ్ కు హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలన్న హైకోర్టు…మసీదుకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించు కోవచ్చని స్పష్టం చేసింది. ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారే ర్యాలీ లో పాల్గొనాలన్న రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనే వారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడద హైకోర్టు తేల్చి చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular