Friday, June 12, 2026
HomeTrending Newsతెలంగాణలో ఐపీస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఐపీస్ అధికారుల బదిలీ

తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ జ‌రిగింది. ఇవ్వాల రాత్రి దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఒకేసారి 29 మంది ఐపీఎస్ అధికారుల బ‌దిలీ జ‌ర‌గ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. కాగా ఇందులో సైబరాబాద్​ సీపీగా ఉన్న స్టీఫెన్​ రవీంద్ర సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌గా నియమిస్తూ… కొత్త పోస్టును క్రియేట్​ చేశారు. ఇక.. అడిషనల్​ డీజీగా ఉన్న రాజీవ్​ రతన్ తెలంగాణ పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా,  సిటీ సీపీగా ఉన్న ​సీవీ ఆనంద్​ కు అదనంగా నార్కొటిక్​ బ్యూరో అడిషనల్ డీజీగా, రోడ్డు, రైల్వే శాఖ డీజీగా ఉన్న సందీప్​ శాండల్య టీఎస్​పీఏ డీజీగా, గ్రేహౌండ్స్​ అడషనల్​ డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి.. ఆర్గనైజేషన్​ లీగల్​ డీజీగా..

పర్సనల్​ డీజీగా ఉన్న బి. శివధర్​రెడ్డి రైల్వేస్​, రోడ్డు సేఫ్టీ డీజీగా, బెటాలియన్​ అడిషనల్​ డీజీగా ఉన్న అభిలాష్​ బిస్త్​  హోంగార్డ్స్​ ఏడీజీగా, ఏసీబీ డైరెక్టర్​గా ఉన్న  షికా గోయల్​​ అడషనల్​ డీజీ షీ టీమ్స్​.. ఎస్​ఎల్​పీఆర్​బీ చైర్మన్​గా ఉన్న వి. శ్రీనివాసరావు.. పోలీసు కంప్యూటర్స్​ అడషనల్​ డీజీగా,  షీటీమ్స్​ అడషనల్​ ఏడీజీగా ఉన్న స్వాతి లక్రా టీఎస్​ ఎస్​పీ బెటాలియన్స్ ఏ డీజీగా, వెయిటింగ్​లో ఉన్న విజయ్​కుమార్​ గ్రేహౌండ్స్​ అండ్​ ఆక్టోపస్​ ఏడీజీగా.. నార్త్​ జోన్​ అడషనల్​ డీజీగా ఉన్న వై నాగిరెడ్డి డిజాస్టర్​ రెస్పాన్స్​ అండ్​ ఫైర్​ సర్వీసెస్​ డీజీగా, వెయిటింగ్​లో ఉన్న విక్రమ్​సింగ్​ మాన్​ ఎల్​ అండ్​ ఓ అడిషనల్​ కమిషనర్​గా బదిలీ అయ్యారు.

అలాగే ఐజీ పర్సనల్ గా కమలాసన్ రెడ్డి, మల్టీ జోన్-1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి, ప్రొవిజనల్, లాజిస్టిక్స్ డిప్యూటీ ఐజీగా రమేశ్, ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా కార్తికేయ, రాజన్న జోన్ డిప్యూటీ ఐజీగా రమేశ్ నాయుడు, కార్ జాయింట్ కమిషనర్ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీగా ఇక్బాల్, రాచకొండ జాయింట్ కమిషనర్ గా గజరావ్ భూపాల్ నియమితులయ్యారు.

అలాగే యాదాద్రి డీఐజీగా రెమారాజేశ్వరి, జోగులాంబ జోన్ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా నారాయణ్ నాయక్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అడ్మిన్ గా పరిమళ హనా నూతన్, సీఐ సెల్ ఇంటెలిజెన్స్ ఎస్ పీగా భాస్కరన్, పోలీస్ కంప్యూటర్స్ సర్వీసెస్ అడిషనల్ గా డీజీగా వి.వి. శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించారు. నేడో, రేపో ఐఏఎస్ ల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం రంగం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular