Thursday, March 19, 2026
HomeTrending NewsNew MLCs: శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

New MLCs: శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, చల్లా వెంకట్రాంరెడ్డి ఈ రోజు (శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో ఉదయం ఈ ముగ్గురితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి పుష్పగుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ,శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.హోంమంత్రి మహమూద్ అలీ,కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, యువజన క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,శాసన మండలి ఛీఫ్ విప్ భాను ప్రసాద రావు, విప్ లు ఎం .ఎస్ ప్రభాకర్ రావు,శంబిపూర్ రాజు,కౌశిక్ రెడ్డి,ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత,దామోదర్ రెడ్డి,వాణీదేవి ,శేరి శుభాష్ రెడ్డి,ఎల్ రమణ ,ఎగ్గే మల్లేశం,దండే విఠల్, రఘోతం రెడ్డి,ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణ రావు, అరికెపూడి గాంధీ,మైనంపల్లి హనుమంతరావు, అబ్రహం, మెతుకు ఆనంద్ కుమార్,రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి,తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా’నరసింహా చార్యులు తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular