Sunday, June 14, 2026
HomeTrending NewsREDCO:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రం

REDCO:ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రం

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాన్ని రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి ప్రారంభించారు. సురేంద్రపురి సమీపంలో ఏర్పాటు చేసిన చార్జింగ్ మెషిన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో (PPP మోడల్) దేశంలోనే మొదటి చార్జింగ్ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రికి ఎలక్ట్రిక్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలు చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువ యూనిట్ ధరతో వాహనాలు చార్జింగ్ చేసుకునే వీలు ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మౌలిక వసతులు పెంచేందుకు రెడ్కో సంస్థ అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో రెడ్కో సంస్థ సొంతంగా చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇవి వాహనదారులకు అందుబాటులోకి రాబోతున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు పాలుపంచుకోవాలని.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై మరింత ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడాయిగూడెం సర్పంచ్ పోశెట్టి, చార్జింగ్ కేంద్రం యజమాని జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular