Saturday, April 20, 2024
HomeTrending Newsమ‌హారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ మోడ‌ల్‌ ప్రస్తావన

మ‌హారాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ మోడ‌ల్‌ ప్రస్తావన

మ‌హారాష్ట్ర‌లో తెలంగాణ మోడ‌ల్‌ ను అమ‌లు చేయాల‌ని ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీనియ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ దాదా సోలంకి డిమాండ్ చేశారు. మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌కాశ్ దాదా మాట్లాడుతూ.. రాష్ట్రం సర్ ప్లస్ అవుతుంది అనే మాటలు ఆపండి. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. కొత్తగా ఏర్ప‌డ్డ‌ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని గమనించండి. ఏదయినా సరే రైతులకు ఇవ్యాలనే తపన ఉండాలె. మంచి చేయాలనే సంకల్పముండాలి. అందుకు తెలంగాణ ఒక ఉదాహరణ. ఆ రాష్ట్రం మోడల్ అమలు చేయండి అని ప్ర‌కాశ్ దాదా డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ఆ రాష్ట్ర‌ రైతులకు ఎకరాకు సంవ‌త్స‌రానికి రూ. 10 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న‌ది అని గుర్తు చేశారు. అంతే కాదు పండించిన ప్రతి గింజనూ అక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నడి. ఎవరైనా రైతు చనిపోతే రూ. 5 లక్షల బీమాను అందిస్తున్నది. అది తెలంగాణ మోడల్. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని అమలుచేయవచ్చు. ధరలు లేక తీవ్రంగా నష్ట‌పోతున్న ఉల్లి రైతులను ఆదుకోవచ్చు. కాకపోతే అందుకు మనస్సుండాలి అని ప్ర‌కాశ్ దాదా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్