తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా 70 ఏండ్ల ముందు ఏర్పడిన రాష్ట్రాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం యాద్గార్పూర్, వల్లభాపూర్ గ్రామాలలో గురువారం రూ. 15 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్ లోకి తీసుకువచ్చామన్నారు.
భవిష్యత్తులో ఆయకట్టుకు ఢోకా ఉండదు. ఏటా రెండు పంటలు పుష్కలంగా పండుతాయన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలోని పేదలందరి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. తాడు బొంగరం లేని కొన్ని పార్టీల వారు ఏదేదో మాట్లాడుతారు.
మీరు 70 ఏండ్లు పాలించి ఏం చేశారన్నారు. మీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు.