Saturday, April 20, 2024
HomeTrending Newsబడులు ప్రారంభం

బడులు ప్రారంభం

రెండేళ్లుగా కరోనా వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైందని, అయినా ఇబ్బందులు లేకుండా విద్య అందించేందుకు కృషి చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆన్ లైన్ పాఠాలు ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు అందేలా చేశామని పేర్కొన్నారు. టెట్ ఎగ్జామ్ నిర్వహణ బాగా జరిగిందని, రేపటి నుంచి బడులు ఓపెన్ చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ లో ఈ రోజు స్పష్టం చేశారు.

పిల్లలందరికీ కూడా స్కూల్స్ కి స్వాగతం పలుకుతున్నామని,ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేయాలని స్కూల్స్ కి ఆదేశాలు ఇచ్చామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ ఇదే స్వాగతం అన్నారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులోకి వచ్చిందని, 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు. 1 నెల బ్రిడ్జ్ క్లాసెస్ లాగా నిర్వహించాలని టీచర్లకు చెప్పామన్నారు.

ఎప్పటిలాగే యథావిధిగా బుక్స్ అందిస్తాం, యూనిఫార్మ్స్ కూడా అందిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రత్యెక చొరవ తీసుకొని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచించారు. ప్రభుత్వం స్కూల్స్ లో టాయిలెట్స్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ను స్థానిక ప్రజాప్రతినిధులు చూసుకోవాలని కోరుతున్నామన్నారు. మిషన్ భగీరథ అన్ని స్కూల్స్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేపు స్థానిక ప్రజాప్రతినిధులు వారి దగ్గర ఉన్న స్కూల్స్ లో పిల్లలకి స్వాగతం పలకాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్