Friday, September 20, 2024
Homeసినిమారామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా ‘తెలిసినవాళ్లు’

రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా ‘తెలిసినవాళ్లు’

Known:  రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ జంటగా న‌టించిన సినిమా తెలిసిన‌వాళ్లు. సిరింజ్ సినిమా బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. విప్లవ్ కోనేటి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన వస్తుంది. రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. విప్లవ్ కోనేటి ఈ సినిమాను తెరకెక్కిస్తూ.. నిర్మిస్తున్నారు.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. అనంత్ నాగ్, అజయ్ నాగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. సినిమాలో విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేక‌ర్స్.

Also Read : ప్రభాస్ ‘రాధే శ్యామ్’కి బిగ్ బి వాయిస్ ఓవర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్