Saturday, January 18, 2025
Homeసినిమానాగార్జున‌, మ‌హేష్ కాంబోలో భారీ మ‌ల్టీస్టార‌ర్.?

నాగార్జున‌, మ‌హేష్ కాంబోలో భారీ మ‌ల్టీస్టార‌ర్.?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. ‘గ‌రుడ వేగ’ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ  ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  నాగ్ సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. భరత్ సౌరభ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

అయితే… ఈ మూవీ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ ఆవిష్కరించి యూనిట్ కి ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలిపారు. థ్రిల్లింగ్, యాక్షన్ తో పాటు గ్రాండియర్ విజువల్స్ తో అదరగొట్టిన ది ఘోస్ట్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి ఆదరణతో కొనసాగుతోంది. ట్రైలర్ ని రిలీజ్ చేసిన మహేష్ బాబుకి ప్రత్యేకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభినందనలు తెలియ‌చేశారు కింగ్ నాగార్జున. అంతే కాకుండా.. “గతంలో 29 ఏళ్ళ క్రితం మీ నాన్న, సూపర్ స్టార్ కృష్ణ గారితో ‘వార‌సుడు’ సినిమాకి వ‌ర్క్ చేశాను. మనం ఇద్దరం కూడా ఎందుకు కలిసి యాక్ట్ చేయకూడదు మ‌హేష్‌” అంటూ పోస్ట్ చేసారు.

దీనికి రిప్లై ఇచ్చిన మహేష్, “మీతో వర్క్ చేయడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను” అంటూ పోస్ట్ చేసారు. దీంతో నాగ్, మ‌హేష్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ సెట్ అయ్యిందా..? అనేది ఆస‌క్తిగా మారింది. నిజానికి వీరిద్దరూ కలిసి చేసే మూవీ కనుక సెట్ అయితే ఆ మల్టీస్టారర్ నిజంగా బాక్సాఫీస్ దగ్గర పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అని చెప్పవచ్చు. మరి  ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ త్వ‌ర‌లోనే సెట్ అవుతుందేమో చూడాలి.

Also Read : ‘ది ఘోస్ట్’ ట్రైలర్ లాంచ్ చేసిన సూపర్ స్టార్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్