Saturday, November 23, 2024
Homeసినిమా'భ్రమయుగం' సినిమాను పట్టించుకోని తెలుగు ఆడియన్స్! 

‘భ్రమయుగం’ సినిమాను పట్టించుకోని తెలుగు ఆడియన్స్! 

సినిమా తీయడం ఒక ఎత్తయితే .. ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడం ఒక ఎత్తు. ఆ సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుంది? ఆ సినిమాలో ఉన్న విశేషాలు ఏమిటి? ప్రత్యేకతలు ఏమిటి? అనే అంశాలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచాలి. అసలు విషయాన్ని దాస్తూనే ఊరించాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. అలా వచ్చిన వాళ్లకి  కంటెంట్ పరంగా అసంతృప్తి కలగకుండా చూసుకుంటే చాలు.

కొన్ని సినిమాలకు ఒక రేంజ్ లో ప్రమోషన్స్ జరుగుతాయి . తీరా థియేటర్ కి వెళితే అందులో ఎలాంటి విషయం ఉండదు. కొన్ని సినిమాలు మంచి కంటెంట్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ లేకపోవడం వలన, ఇలా థియేటర్స్ కి వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ‘భ్రమయుగం’ కూడా చేరిపోయిందనే చెప్పాలి. ఈ నెల 15వ తేదీన మలయాళంలో విడుదలైన ఈ సినిమా, అక్కడ చాలా వేగంగా 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మమ్ముట్టి కెరియర్లో నిలిచిన ప్రత్యేకమైన పాత్రలలో ఇది ఒకటి అనే అభిప్రాయలు వ్యక్తమయ్యాయి.

ఈ సినిమా ఈ నెల 23వ తేదీన తెలుగులో విడుదలైంది. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడం వలన, రిలీజ్ రోజున కూడా థియేటర్స్ దగ్గర ఎలాంటి సందడి కనిపించలేదు. కానీ సినిమాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది. కొన్ని రోజుల తరువాత ఓటీటీలో ఈ సినిమా చూసినవారు, థియేటర్స్ లో మిస్సయినందుకు ఫీల్ అవుతారు. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా .. హారర్ థ్రిల్లర్ జోనర్ .. మూడే పాత్రలతో సినిమా అంతా నడుస్తుంది. అయినా బోర్ కొట్టకపోవడం విశేషం. ఇది రెగ్యులర్ సినిమా కాదు .. ఒక ప్రయోగం. తప్పకుండా మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందనడంలో సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్