Saturday, March 14, 2026
Homeస్పోర్ట్స్Ultimate Kho Kho: తెలుగు యోధాస్ ఓటమి

Ultimate Kho Kho: తెలుగు యోధాస్ ఓటమి

వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఊపు మీదున్న తెలుగు యోధాస్ కు బ్రేక్ పడింది.  అల్టిమేట్ ఖో ఖో టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై క్విక్ గన్స్ పై 46-53 తేడాతో ఓటమి పాలైంది.  ఆట  ప్రథమార్ధంలో అంతగా సత్తా చూపని యోధాస్ జట్టు చివరి భాగంలో చురుగ్గా ఆడినప్పటికీ ఫలితంలేకపోయింది.

అంతకుముందు జరిగిన మరో మ్యాచ్ లో ముంబై ఖిలాడీస్ పై గుజరాత్ జెయింట్స్ 66-48  తేడాతో విజయం సాధించింది.

గుజరాత్ జెయింట్స్ ఇప్ప్పటికి తాను ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది, తెలుగు యోధాస్ మూడు మ్యాచ్ ల్లో రెండు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular