Tuesday, March 10, 2026
Homeసినిమాఆకట్టుకుంటోన్న వైష్ణ‌వ్ తేజ్ ‘తెలుసా తెలుసా’ పాట

ఆకట్టుకుంటోన్న వైష్ణ‌వ్ తేజ్ ‘తెలుసా తెలుసా’ పాట

Telusaa Song  : వైష్ణ‌వ్ తేజ్, కేతికాశర్మ జంటగా శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ పై రూపొందుతోన్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమాలోని ‘తెలుసా తెలుసా ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో.. ఎవరికి ఎవరేమి అవుతారో’ సాంగ్‌ విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు. శ్రీమణి సాహిత్యం రాశారు. శంకర్‌ మహదేవన్‌ గొంతులో ఆకట్టుకుంటోంది పాట. యూట్యూబ్‌లో లిరికల్‌ సాంగ్‌ మధ్యలో వచ్చే ఆన్‌ లొకేషన్‌ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న సినిమా ‘రంగ రంగ వైభ‌వంగా’. ‘ఉప్పెన’ తో  సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ ఈ సినిమా లొకేషన్ విజువల్స్ లో ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ టీజర్‌, టైటిల్‌కి ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. సినిమా ఆద్యంతం సరికొత్తగా సాగుతుందని, యూత్‌ని మెప్పించేలా ఉందని అన్నారు మేకర్స్.

హీరో, హీరోయిన్ మ‌ధ్య న‌డిచే బ‌ట‌ర్ ఫ్లై కిస్ థియ‌రీకి ట్రెమండస్‌ రెస్పాన్స్ వచ్చిందని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్తుందని అన్నారు డైరక్టర్‌ గిరీశాయ. అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది గిరీశాయకు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఆయన రూపొందిస్తోన్న ఈ సినిమాకు శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular