Tuesday, September 17, 2024
HomeTrending NewsTrains cancelled: బహనాగ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్ళు రద్దు

Trains cancelled: బహనాగ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్ళు రద్దు

ఒడిశాలోని బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్‌ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోపాటు ఈ నెల 30న కూడా ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. వీటిలో హౌరా- శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం, షాలిమార్‌-సికింద్రాబాద్‌, తంబారమ్‌-సత్రగచి, హైదరాబాద్‌-షాలిమార్‌, బెంగళూరు-హౌరా, చెన్నై-షాలిమార్‌ వంటి స్టేషన్‌ పరిధిలో రైళ్ల రాకపోకలు నిలిచిపోతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్