Tuesday, January 21, 2025
HomeTrending Newsసిక్కింలో ఘోర ప్రమాదం... 16 మంది సైనికుల దుర్మరణం

సిక్కింలో ఘోర ప్రమాదం… 16 మంది సైనికుల దుర్మరణం

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చాటెన్‌ నుంచి తంగు తిరిగి వెళ్తుండగా జెమా ప్రాంతంలో అదుపుతప్పి ఆర్మీ ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సైనికులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లు, 13 మంది సైనికులు ఉన్నారు. మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు.

ఉత్తర సిక్కింలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికుల వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తర ప్రాంతంలో ఉదయం 11 వరకు పొగమంచు కమ్ముకొని ఉండటం..ప్రమాదానికి కారణం అయి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్