Friday, April 4, 2025
HomeTrending Newsకశ్మీర్‌లో ఉగ్రదాడి...ముగ్గురు పౌరుల మృతి

కశ్మీర్‌లో ఉగ్రదాడి…ముగ్గురు పౌరుల మృతి

జమ్ముకశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు ముష్కర మూకలు విఫల యత్నం చేస్తున్నాయి. కొత్త ఏడాది వేళ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సమయంలో దారుణానికి పాల్పడ్డారు. రాజౌరీలో చోటుచేసుకున్న అనుమానిత ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రాజౌరీ జిల్లా డాంగ్రీ గ్రామంలో ఆదివారం ఇద్దరు సాయుధులు పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. కాల్పులకు తెగబడ్డ వారు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని, వారి కోసం గాలిస్తున్నట్టు అదనపు డీజీపీ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్