Saturday, March 14, 2026
Homeసినిమా'బ్రో' ఒక అభిమానిగా మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నాయి: నిర్మాత టి.జి. విశ్వప్రసాద్

‘బ్రో’ ఒక అభిమానిగా మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నాయి: నిర్మాత టి.జి. విశ్వప్రసాద్

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం సమకూర్చారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. అభిమానుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగిన ఈ మెగా ఈవెంట్ లో మెగా కుటుంబం సందడి చేసింది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ” ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి సినిమా మొదటిరోజు మొదటి షో చూడటం గొప్ప అవకాశం అనుకునేవాడిని. అలాంటిది పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడి ఆయనను దగ్గరనుంచి చూసే అవకాశం దొరికింది. అక్కడనుంచి పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు కలిసి నటించిన మొదటి సినిమా నిర్మించే అవకాశం దక్కింది. దీనికి త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తోడయ్యాయి. కళ్యాణ్ గారు ఇచ్చిన టైంలో సముద్రఖని గారు సినిమా పూర్తి చేశారు. దీనినే టైం కలిసిరావడం అంటారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక అభిమానిగా మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు టైంగా విశ్వరూపం చూపించిన ఈ సినిమా మా బ్యానర్ లో 25వ సినిమా కావడం గొప్ప విషయం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular