6.1 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending NewsNo Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

No Confidence Motion: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్ డి ఏ స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మానానికి విపక్ష పార్టీలు నేడు నోటీస్ లు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపి గౌరవ్ గోగోయ్ లోకసభ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి 26 పార్టీలు మద్దతు తెలిపాయి. మ‌ణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు స‌రిగా లేవ‌ని పార్టీలు ఆరోపించాయి. లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఎంపీ నామా లేఖ రాశారు. రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా తెలిపారు. ఇవాళ జ‌రిగే లోక్‌స‌భ బిజినెస్‌లో ఈ నోటీసును కూడా చేర్చాల‌ని ఆయ‌న సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌ను కోరారు. కాగా, విప‌క్షాల కూట‌మి INDIA త‌రుపున కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ‌ల్ కూడా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోష‌న్ ఫైల్ చేశారు. 50 మంది ఎంపీలు సంతకాలు చేసారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించే అంశం పైన ఎంపీలకు విప్ జారీ చేసారు.
మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చ‌కు ప్ర‌ధాని మోదీ ముఖం చాటేయ‌డం వ‌ల్ల .. కేంద్ర ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. పార్ల‌మెంట్ వర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మై నాలుగు రోజులు గ‌డిచినా స‌భ స‌జావుగా సాగ‌డం లేదు. కేంద్రం నిర్ల‌క్ష్య వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వ‌డం స‌రైందే అని బీఆర్ఎస్ భావిస్తోంది.

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. ‘ఇండియా’కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్‌ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 2018లో మోడీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్