Saturday, June 6, 2026
HomeసినిమాThangalaan: అంచనాలు పెంచేసిన విక్రమ్ 'తంగలాన్' మేకింగ్ వీడియో

Thangalaan: అంచనాలు పెంచేసిన విక్రమ్ ‘తంగలాన్’ మేకింగ్ వీడియో

హీరో విక్రమ్ కొత్త సినిమా ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్.ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం విక్రమ్ ఇంతకు ముందెప్పుడూ కనిపించని గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ వీడియో గ్లింప్స్ చూస్తోంటే.. మూవీ కోసం ఎంతో కష్టపడుతున్నట్టుగా ఉంది. ఈ తరహా చిత్రాల్లో విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు.

అది మరోసారి తంగలాన్ తో కనిపించబోతోందనిపిస్తోంది. ప్యాన్ ఇండియన్ సినిమాగా బహు భాషల్లో విడుదల కాబోతోన్న తంగలాన్ లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతికరణ్, ముత్తుకుమార్ తో పాటు అనేకమంది ఇతర ప్రముఖులు నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular