Saturday, June 27, 2026
Homeసినిమాఇండియాకు ‘థ్యాంక్యూ’

ఇండియాకు ‘థ్యాంక్యూ’

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్, రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంది. ఆతర్వాత కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం ఇటలీ వెళ్లింది థ్యాంక్యూ టీమ్. గత కొన్ని రోజులుగా ఇటలీలో థ్యాంక్యూ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే.. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కూడా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కావాలి కానీ.. ఇండియా నుంచి ఇటలీ వెళ్లేందుకు ఆంక్షలు విధించడంతో ప్రకాష్‌ రాజ్ థ్యాంక్యూ షూటింగ్ కి వెళ్లలేకపోయారు.

ఇప్పుడు అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి పయనమైంది థ్యాంక్యూ టీమ్. ఇటలీలో నాగచైతన్య, రాశీఖన్నాల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి బి.వి.ఎస్.రవి కథను అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ రిలీజ్ కి రెడీగా ఉంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న రిలీజ్ కావాలి కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా వేశారు.

జులై నుంచి కరోనా తగ్గి అంతా నార్మల్ అవ్వచ్చు. అప్పుడు వెంటనే థియేటర్లు ఓపెన్ చేస్తారా..? ఇంకా టైమ్ తీసుకుంటారా..? అనేది తెలియాల్సివుంది. థియేటర్లు ఓపెన్ చేస్తే ముందుగా లవ్ స్టోరీ రిలీజ్ చేస్తారు. అందుచేత థ్యాంక్యూ మూవీ సెప్టెంబర్ లో రాకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular