Sunday, January 19, 2025
Homeసినిమానాగ‌చైత‌న్య థ్యాంక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్?

నాగ‌చైత‌న్య థ్యాంక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్?

Coming in July: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే.. గ‌త కొన్ని రోజులు నుంచి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు.

ఇందులో చైతు.. మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. దీని కోసమే ప్రత్యేకంగా ఒక్కడు, పోకిరి కటవుట్లు వేసి షూటింగ్ చేశారు. ‘ఉయ్యాలా జంపాల’ ఫేమ్ అవికా గోర్ మరో ముఖ్యమైన పాత్ర చేస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అయితే.. థ్యాంక్యూ మూవీ గురించి అప్ డేట్స్ లేక‌పోవ‌డంతో రిలీజ్ ఎప్పుడు అనేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై 7 విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారట.

త్వ‌ర‌లోనే జులై 7న థ్యాంక్యూ మూవీ రిలీజ్ అని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేస్తార‌ని స‌మాచారం. మ‌రి.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతోన్న చైతూ థ్యాంక్యూ మూవీతో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read ‘థాంక్యూ’ న్యూపిక్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

RELATED ARTICLES

Most Popular

న్యూస్