Tuesday, March 10, 2026
Homeసినిమాతరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో సాయి సుశాంత్‌ హీరోగా మూవీ

తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో సాయి సుశాంత్‌ హీరోగా మూవీ

‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఇప్పుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్‌ రూపొందుతుంది. సాయిసుశాంత్‌ రెడ్డి ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భైరవ్‌ పాత్రలో కనిపించ‌నున్నారు సాయి సుశాంత్‌. ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై ప్రమోద్‌ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్‌ తంజావూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న మూవీ ఇది. ఈ సినిమా ‘ఫీలర్‌ వీడియో’ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డిఫరెంట్‌ లొకేషన్స్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫీలర్‌ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించేలా ఉంది. ట్రెండ్ కు తగ్గట్గుగా ఈ సినిమా ఉంటుదని.. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.  సాయిసుశాంత్‌ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: రోహిత్‌ తంజావూర్‌, నిర్మాతలు: ప్రమోద్‌కుమార్, రాజు, బ్యానర్‌: ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌, డీఓపీ: కె. సిద్దార్థ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular